Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / సింగరేణి ఎన్నికల్లో గులాబీ ప్రభంజనం

సింగరేణి ఎన్నికల్లో గులాబీ ప్రభంజనం

హైదరాబాద్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకున్నది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. సింగరేణి పరిధిలోని 11 ప్రాంతాలలో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ జరిగింది. మొత్తం 52,534 ఓట్లకు గాను 49,873 మంది (94.93 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందులో అత్యధికంగా 1,112 మందికి గాను 1,095 మంది (98.47 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి, కార్పొరేటు ఆఫీసు, శ్రీరాంపూర్, కొత్తగూడెం, రామగుండం 1, 2, 3 డివిజన్లలో టీబీజీకేఎస్ విక్టరీ సాధించింది. ఈ ఎన్నికల్లో 15 కార్మిక సంఘాలు పోటీ చేశాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీడీపీ అనుబంధ సంస్థ కలిసి బరిలోకి దిగాయి. అయినా ఉద్యమ సమయంలో జరిగిన ఎన్నికల కంటే ఎక్కువ ఏరియాల్లో విజయం సాధించింది టీబీజీకేఎస్. మొత్తం 11 ఏరియాలకు గానూ టీబీజీకేఎస్ 9 చోట్ల, ఏఐటీయూసీ రెండు చోట్ల విజయం సాధించాయి.

ఏరియాలవారీగా విజయం/మెజారిటీ వివరాలు..

కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో మొత్తం 1,475 ఓట్లు ఉండగా.. 1,415 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు పోల్‌కాగా.. ఏఐటీయూసీ కూటమికి 322 ఓట్లు వచ్చాయి. 544 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్‌ విజయదుందుభి మోగించింది.

ఇల్లెందు ఏరియాలో మొత్తం 1,112 ఓట్లు ఉండగా.. 1,095 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ కూటమికి 400 ఓట్లురాగా.. టీబీజీకేఎస్‌కు 217 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకుంది.

మణుగూరులో 2,883 ఓట్లు ఉండగా 2,816 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 1,623, ఏఐటీయూసీకి 992 ఓట్లు వచ్చాయి. 631 ఓట్లతో టీబీజీకేఎస్‌ గెలుపొందింది.

బెల్లంపల్లిలో మొత్తం 1,743 ఓట్లు ఉండగా.. 1,683 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌కు 862, ఏఐటీయూసీకి 688 వచ్చాయి. 174 ఓట్లతో టీబీజీకేఎస్‌ విజయం సాధించింది.

కొత్తగూడెం ఏరియాలో 3,712 ఓట్లకుగాను 3,592 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌ 771 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది.

శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్‌ 2,215 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.

మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ 800 ఓట్ల మెజార్టీతో గెలిచింది.

భూపాలపల్లిలో 6,854 ఓట్లకుగాను 6,415 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ 936 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.

రామగుండం–1లో 6,876 ఓట్లకుగాను 6,476 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌ 366 ఓట్ల మెజార్టీతో విజయం.

రామగుండం–2లో 4,221 ఓట్లకుగాను 4,000 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్‌ 764 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది.

రామగుండం–3లో 5,367 ఓట్లకుగాను 5,004 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ 226 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.