Home / Breaking News  / రైతుకు రైతే శత్రువు : సీఎం కేసీఆర్

రైతుకు రైతే శత్రువు : సీఎం కేసీఆర్

హైదరాబాద్:  శామీర్‌పేట మండలంలోని కేశవరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు.ఒక రైతు వేసిన పంటనే మరో రైతు, ఇంకో రైతు వేలం వెర్రిగా పడిస్తుండటం వల్ల గిట్టుబాటు ధర లేక రైతుకు రైతే శత్రువు అవుతున్నాడని, ఆ విధంగా జరగకుండా చూసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ శివారు శామీర్ పేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా రైతుల పరిస్థితి బాగుండలేదని, ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 12 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అవసరమైతే మరో రూ. 12 కోట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కేశవరం, లక్ష్మాపూర్ గ్రామ సమస్యలు తీరుస్తామని చెప్పారు సీఎం. గ్రామస్థులు రూ. 10 కోట్ల పనులు అడిగారు.. రూ. 12 కోట్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. అభివృద్ధి పనుల కోసం శనివారం మధ్యాహ్నం కల్లా జీవోలు ఇస్తామని చెప్పారు. ఆదివారం నుంచే పనులు ప్రారంభమవుతాయని సీఎం స్పష్టం చేశారు.

గ్రామంలో రూ. 75 లక్షలతో కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని సీఎం చెప్పారు. కేశవరంలో రూ. 30 లక్షల వ్యయంతో మహిళా వేదిక నిర్మిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్‌లో మార్పులు తీసుకువస్తామని ప్రకటించారు. 15 రోజుల్లో కేశవరం రెవెన్యూ రికార్డులన్నీ మ్యుటేషన్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిజమైన రైతులను గుర్తిస్తే నేరుగా పథకాలు అందేలా చూడటం సులభమని సీఎం చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తున్నామని తెలిపారు. ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేయకుంటే నీళ్లు, విద్యుత్ వృథా అవుతుందన్నారు. హరితహారంలో భాగంగా గ్రామస్థులు మొక్కలు నాటాలన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.