Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / రేపటి నుంచి లారీల సమ్మె , 9,10 తేదీల్లో రాష్ట్రంలో కూడా…

రేపటి నుంచి లారీల సమ్మె , 9,10 తేదీల్లో రాష్ట్రంలో కూడా…

న్యూఢిల్లీ: డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 36 గంటలపాటు లారీలను ఎక్కడికక్కడ నిలిపివేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ప్రతినిధులు శనివారం స్పష్టంచేశారు. జీఎస్టీ పన్ను విధానాలు సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. సమ్మెకు కోల్ కతా గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ కూడా మద్దతు తెలిపింది. డీజిల్, టోల్ ట్యాక్స్ కలిపి 70 శాతం సరుకు రవాణా ఖర్చు అవుతున్నదని ఆ సంఘం అధ్యక్షుడు ప్రభాత్‌కుమార్ మిట్టల్ చెప్పారు. డీజిల్ ధర జీఎస్టీ పరిధిలోకి వస్తే తమ రవాణా వ్యయం తగ్గుతుందన్నారు. డీజిల్ ధరలను రోజువారీగా కాకుండా మూడునెలలకోసారి సమీక్షించాలని డిమాండ్ చేశారు.

జీఎస్టీ, రోజువారీ డీజిల్ ధరల మార్పిడి, టోల్‌ట్యాక్స్ విధానానికి నిరసనగా ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్రంలో కూడా లారీల రవాణాను నిలిపి వేస్తున్నట్టు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఎలాంటి సరుకు రవాణా బుకింగ్‌లు, డెలివరీ.. లోడింగ్, అన్‌లోడింగ్ చేయరాదని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ), ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏఐటీడబ్ల్యూఏ), సౌత్‌ఇండియా మెటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ పిలుపునిచ్చాయి.ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ), ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏఐటీడబ్ల్యూఏ), సౌత్‌ఇండియా మెటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ పిలుపునిచ్చాయని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నూకల భాస్కర్‌రెడ్డి తెలిపారు.

మరోవైపు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 13న దేశవ్యాప్తంగా 54 వేల పెట్రోల్ పంపులు ఒకరోజు సమ్మె చేయనున్నాయి.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.