Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / యూపీలో మదరసా కమిటీ సంచలన నిర్ణయం…ఆగస్టు 15 వేడుకలు

యూపీలో మదరసా కమిటీ సంచలన నిర్ణయం…ఆగస్టు 15 వేడుకలు

ఉత్తరప్రదేశ్ లో మదరసా కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా ఆగష్టు 15 వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైంది. జెండా ఆవిష్కరణతో పాటు జాతీయ గేయం ఆలపించాలని పేర్కొంటూ రాష్ట్రంలోని అన్ని మదర్సాలకు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఆగస్ట్ 15 సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించటంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం యోగి ఆదిత్యానాథ్‌… మదరాసా శిక్ష పరిషత్‌ను కోరారు. ఇందుకు మదరసా పరిషత్‌ అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 8వేల మదరసాలన్నింటికి పరిషత్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగష్టు 15న సరిగ్గా ఉదయం 8 గంటలకు రాష్ట్రంలోని అన్ని మదరసాలలో జెండా ఆవిష్కరణ నిర్వహించి… జాతీయ గేయాన్ని ఆలపించనున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.