Home / Breaking News  / మా కుటుంబం మంత శివ భక్తులం : రాహుల్ గాంధీ

మా కుటుంబం మంత శివ భక్తులం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు హిందూ దేవాలయాలను తెగ తిరిగేస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఎప్పుడూలేనిది వరుసగా ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నారు.అమ్రేలీలో నిన్న కెమెరాలకు దూరంగా జరిగిన ప్రైవేట్ మీటింగ్‌లో రాహుల్ మాట్లాడారు. అందులో పాల్గొన్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో తీసిన వీడియో బయటకు వచ్చింది. మా నాన్మమ్మ (ఇందిరాగాంధీ), మా కుటుంబం శివ భక్తులం. కానీ ఇలాంటి విషయాలను మేము ప్రైవేట్‌గానే ఉంచుతాం. ఇది వ్యక్తిగత విషయం. దీనిపై మాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు అని రాహుల్ చెప్పడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇలాంటి విషయాలను రాజకీయాలకు వాడుకునే అలవాటు తమకు లేదని ఆయన స్పష్టంచేశారు.

కొందరు బీజేపీ నేతలు సోమ్‌నాథ్‌ టెంపుల్‌ నాన్‌ హిందూ రిజిస్టర్‌లో రాహుల్‌ సంతకం చేయడాన్ని పెద్ద వివాదమే చేస్తున్నారు. అయితే తాను గుడిలోకి నేరుగా వెళ్లానని, బయటకు వచ్చే సమయంలో విజిటర్స్ బుక్‌లో సంతకం చేశానని రాహుల్ చెప్పారు. ఆ తర్వాతే బీజేపీ కార్యకర్తలు రెండో బుక్‌లో తన పేరు ఎంటర్ చేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆ ఆలయ ట్రస్టీల్లో ఒకరని, ఈ కుట్ర వెనుక ఆయన హస్తం ఉన్నదని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్‌సిన్హ్ సోలంకి విమర్శించారు. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. రాహులే ఆ రిజిస్టర్‌లో తన వివరాలను రాశారని స్పష్టంచేసింది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.