Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / Breaking News  / మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ప్లాన్…

మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ప్లాన్…

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు  ప్లాన్ చేస్తుంది. మావోయిస్ట్ వ్యతిరేక కార్యక్రమాల్లో మరింత కఠినంగా ముందుకెళ్లాల్సి ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మావోయిస్ట్ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ఇంటెలిజెన్స్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మావోయిస్టులను ఎదుర్కొనడంలో రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అభివృద్ధి ప్రజలకు చేరకూడదన్నదే మావోయిస్టుల ధ్యేయంగా కనిపిస్తోందని వారి చర్యలను బట్టి తెలుస్తోందని చెప్పారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు రాష్ర్టాలు మరింత సంసిద్ధం కావాలన్నారు. మరింత అప్రమత్తత, రెట్టింపు వేగంతో ముందుకెళ్లాల్సి ఉందన్నారు.

మావోయిస్టులను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో వనరులు వినియోగించాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచించారు. మావోయిస్టులపై ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మావోయిస్టుల ఏరివేత కోసం సమాధాన్ పేరుతో మంత్రి కొత్త వ్యూహాన్ని ప్రతిపాదించారు. మావోయిస్టులు ఆయుధాలు కొనేందుకు అవసరమైన ఆర్థిక వనరులను దెబ్బతీయటమే ఈ సమాధాన్ వ్యూహమని రాజ్‌నాథ్‌ తెలిపారు. ఏపీ,తెలంగాణ మధ్య భద్రత విషయంలో సమన్వయ లోపం లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. తమకు మరిన్ని బలగాలను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అదనపు బలగాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఇరురాష్ట్రాలు చెప్పాయి.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.