Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / భారత్‌పై పాక్‌ అణుబాంబులు…అమృతసర్‌కు సమీపంలో సొరంగాల నిర్మాణం

భారత్‌పై పాక్‌ అణుబాంబులు…అమృతసర్‌కు సమీపంలో సొరంగాల నిర్మాణం

న్యూఢిల్లీ : భారత్ పై పాకిస్థాన్ అణ్వాయుధాలను ఎక్కుపెడుతోందని రిపోర్టులు వస్తున్నాయి. పాక్ వద్ద దాదాపు 140 అణు ఆయుధాలు ఉండవచ్చని ఓ అంచనా. వీటన్నింటినీ ఓ రహస్య ప్రదేశంలో దాచేందుకు పాక్ యత్నిస్తోంది. దీనికోసం సొరంగాన్ని నిర్మిస్తోందని ఓ అంతర్జాతీయ వెబ్ సైట్ పేర్కొంది. పాక్ లోని మియన్ వాలీ పట్టణం సమీపంలో ఈ సొరంగాన్ని నిర్మిస్తోందని తెలిపింది.ఈ ప్రదేశానికి లాంచర్లను తీసుకెళ్లేలా భారీ రోడ్లతో కలుపుతున్నట్లు వెల్లడించింది.

ఈ సొరంగాలు 10 మీటర్ల ఎత్తు, వెడల్పు కలిగి ఉంటాయి. ఇలాంటి సొరంగాలను మూడింటిని నిర్మిస్తోందని సదరు వెబ్ సైట్ తెలిపింది.మియన్‌వాలీ పట్టణాన్ని స్థావరంగా ఎంచుకోవడం వెనుక పెద్ద ఆలోచన ఉందని పేర్కొంది. మియన్‌వాలీ నుంచి పంజాబ్‌లోని అమృతసర్‌కు దూరం కేవలం 350 కిలోమీటర్లు. అదే న్యూఢిల్లీకైతే 750 కిలోమీటర్లు.తక్కువ దూరంలో అణు ఆయుధాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా శత్రువును చావుదెబ్బ కొట్టాలనే వ్యూహం పాకిస్తాన్‌ పన్నినట్లు తెలుస్తోంది.తక్కువ దూరంలోనే అణ్వాయుధాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా… భారత్ పై దాడికి సన్నద్ధంగా ఉండాలనేదే పాక్ ఆలోచన.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.