Home / Breaking News  / బీసీలు, ఎంబీసీల సమగ్రాభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికపై , నేడు ప్రత్యేక సమావేశం

బీసీలు, ఎంబీసీల సమగ్రాభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికపై , నేడు ప్రత్యేక సమావేశం

* 40 మంది బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ

* ఐదు అంశాలతో ఎజెండా సిద్ధం

* అన్ని పార్టీల్లోని బీసీ ప్రజాప్రతినిధులకు ఆహ్వానం

* బీసీల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలపై విశ్లేషన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో బీసీ కులాలను ఆకట్టుకునే వ్యూహాలకు ప్రభుత్వం పదును పెడుతోంది. వెనుకబడిన వర్గాల సంక్షేమ పథకాల మీద ఆదివారం (డిసెంబర్-3)న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్ష చేయనున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో మీటింగ్ మొదలవుతుంది. దీనికి అన్ని పార్టీల బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరవుతారు. ఈ భేటీకి హాజరు కావాలని అన్ని పార్టీల్లోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీసీ సంక్షేమశాఖ ఆహ్వానించింది.

బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, వాటి పురోగతిపై ముఖ్యమంత్రి ఈ భేటీలో విశ్లేషించనున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో నివేదికను ప్రదర్శించే అవకాశాలున్నాయి. దీంతోపాటు హాజరైన ప్రజాప్రతినిధులందరికీ నివేదికను హ్యాండవుట్ల రూపంలో అందించనున్నారు. అనంతరం ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో బీసీ కులాలకు ప్రభుత్వం నిర్దేశించిన నిధులు, కేటాయింపులు, వాటి అమలు తీరుపై ప్రధానంగా చర్చ జరగనుంది.

బీసీ సంక్షేమం, అభివ్రుద్ధి ప్రణాళికలపై శనివారం మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావు, బీసీ సంక్షేమశాఖ అధికారులతో సమీక్షించారు. ఆదివారం సమావేశానికి అజెండాపై చర్చించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిపి 39 మంది ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు. బీసీల్లో వివిధ వర్గాల సమస్యలపై వారితో చర్చించి, వారి కోసం ప్రత్యేక ఆర్థిక పథకాలు, ప్రణాళిక తయారుచేయడం మీద సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాల అనంతరం ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయటం తప్ప ఎంబీసీల పరిధిలోకి వచ్చే కులాలేమిటో ఇప్పటివరకు గుర్తించలేదు. దీంతో నిధులేవీ ఖర్చు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంబీసీ కులాల గుర్తింపునకు అనుసరించాల్సిన ప్రాతిపదిక, ఏయే కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలి వంటి అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.