Home / Breaking News  / పార్లమెంటులో చట్టం తేవాలని కేంద్రాన్ని కోరతాం: సీఎం కేసీఆర్‌

పార్లమెంటులో చట్టం తేవాలని కేంద్రాన్ని కోరతాం: సీఎం కేసీఆర్‌

* ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానిపై ఒత్తిడి తెస్తాం

*బీసీల అభ్యున్నతిపై అసెంబ్లీలో ఒకరోజు పూర్తిస్థాయి చర్చ

*తర్వాత అవసరమైన తీర్మానాలు, చట్టాలు, జీవోలు తెస్తాం

*పరిశ్రమలకు స్థలాల కేటాయింపుల్లో బీసీ పారిశ్రామికవేత్తలకు రిజర్వేషన్లు

*అన్ని పార్టీలతో కలసి సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం

హైదరాబాద్‌ : బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం తేవాలని రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు.అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ సమావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ వివరించారు.

రాష్ట్రం నుంచి అఖిలపక్ష కమిటీ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలసి ఈ విషయంపై ఒత్తిడి తెస్తుందని ప్రకటించారు. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని, పదోన్నతుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని, పదోన్నతుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరునున్నట్లు తెలిపారు. బీసీల డిమాండ్లపైనా, బీసీల అభ్యున్నతి కోసం తీసుకునే నిర్ణ‌యాల‌పై త్వరలోనే అసెంబ్లీలో ఒక రోజు పూర్తి స్థాయి చర్చ చేపట్టాలని ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీకర్ ను కోరారు.

బీసీ ప్రజాప్రతినిధులంతా రెండు మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించుకుని, తమకు ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చించి అవసరమైన తీర్మానాలు, చట్టాలు, జీవోలు తేవాలని సిఎం నిర్ణయించారు. బీసీ ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రకారం అవసరమైన చట్టాలు తేవడానికి, ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుత విధానంలో ఏమైనా లోపాలుంటే మార్చుకోవడానికి కూడా తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. అంతిమంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బీసీలకు మేలు కలగాలని, వారి భవిష్యత్‌కు మంచి బాటలు పడాలన్నదే తన లక్ష్యమన్నారు.

కొన్ని కులాలకు సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులున్నాయి. ప్రభుత్వ లబ్ది అందుకునే విషయంలో కొన్ని కులాల మధ్య ఘర్షణలున్నాయి. కొన్ని కులాల గుర్తింపుకు సంబంధించిన సమస్యలున్నాయి. హాస్టళ్లలో పిల్లలు చేరకుండా రెసిడెన్షియల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి అన్ని విషయాల్లో ఆచరణీయమైన మార్గాన్ని ప్రజాప్రతినిధులు సూచించాల అని సిఎం కోరారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.