Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / నేరేళ్ల ఘటన దురదృష్టకరం : మంత్రి కేటీఆర్

నేరేళ్ల ఘటన దురదృష్టకరం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ : నేరేళ్ల ఘటన దురదృష్టకరమని, విచారణ తర్వాత పోలీసులపై చర్యలు ఉంటాయన్నారు. ఇసుక మాఫియాను అరికట్టిన ఘటన తమ ప్రభుత్వానిదేనని, ఆదాయం పెరగడమే అందుకు నిదర్శనమని కేటీఆర్‌ పేర్కొన్నారు. నేరెళ్ల ఘటనలో ఇసుక లారీల ప్రమాదం నిజమన్నారు మంత్రి కేటీఆర్. ఆవేశంలోనే గ్రామస్థులు లారీలను తగులబెట్టారని చెప్పారు. పోలీసుల అరెస్టు, కస్టడీ విషయం తనకు తెలియదన్నారు. రిమాండ్ రిజెక్ట్ అయ్యాక సమస్య వెలుగులోకి వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. పోలీసులను ప్రయోగించే అవసరం ఏముందన్నారు. నేరెళ్ల ఘటనలో పోలీసుల అత్యుత్సాహం ఉందని తెలిపారు. డీఐజీ రిపోర్టు వచ్చాక కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.

నేరెళ్ళ కేసులో దళిత కోణం లేదన్నారు మంత్రి కేటీఆర్. ఇది కేవలం ప్రతిపక్షాల ఆరోపణేనన్నారు. దళిత మారణకాండలు జరిగింది కాంగ్రెస్ హయాంలోనేనని చెప్పారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు తేలితే.. తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని మంత్రి చెప్పారు. రోజుకో ప్రతిపక్షం వెళ్లడం వల్లే.. నేరెళ్ల బాధితులను పరామర్శించడం ఆలస్యమైందని చెప్పారు. విపక్షాల ఆరోపణలకు బెదిరేది లేదని.. రాజకియాల్లో ఉన్నంత కాలం సిరిసిల్ల నుంచే పోటీ చేస్తాని కేటీఆర్ చెప్పారు.

నేరెళ్ళ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరపాలన్న పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.బాదితులకు మెరుగైన వైద్యం అందించాలని.. అవసరమైతే NIMSకు తరలించాలని కోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రిన్సిపల్ సెక్రెటరీని అదేశించింది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.