Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / దిగ్విజయ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం షాక్.. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్‌గా కుంతియా

దిగ్విజయ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం షాక్.. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్‌గా కుంతియా

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ను మంగళవారం ఆ పదవి నుంచి తొలగించారు.దిగ్విజయ్‌ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌గా పార్టీ సీనియర్ నేత కుంతియాను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

తన పదవీ కాలంలో దిగ్విజయ్‌.. పనితీరు కంటే పలు వివాదాస్పద వ్యాఖ‌్యలతో వార్తల్లో నిలిచారు. ఐసీస్‌ సానుభూతిపరుల విషయంలో తెలంగాణ పోలీసులపై ఆరోపణలు చేసిన దిగ్విజయ్‌.. తాజాగా డ్రగ్స్‌ వ్యహారంలో టీఆర్‌ఎస్‌ నేతలపై ఆరోపణలు చేశారు. కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నేతలను కూడా ఇరుకున పడేలా దిగ్విజయ్‌ వ్యవహరించడంతో అధిష్ఠానం తెలంగాణ ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించింది.

ఆ మధ్య ఐసిస్‌ సానుభూతిపరుల విషయంలో, ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్‌ రాకెట్‌ కేసులోనూ డిగ్గీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో పార్టీ సైతం ఇరుకున పడేలా వ్యవహించిన ఆయను ఉన్న పళంగా తప్పించడం వెనుక కారణాలు ఏమిటనేది తెలియాల్సిఉంది. దీనిపై స్థానిక కాంగ్రెస్‌ నేతలు స్పందించాల్సిఉంది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.