Home / Breaking News  / తెలంగాణ భూసేకరణ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ భూసేకరణ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ :  తెలంగాణ భూసేకరణ చట్టం-2013కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి భవన్ కు పంపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఈ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే… ఈ బిల్లు చట్టంగా మారుతుంది. సత్వరమే భూసేకరణ చేసేందుకు 2013 కేంద్ర భూసేకరణ చట్టాన్ని అనుసరించి నూతన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం 2016 డిసెంబర్ లో తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ ఆరు సవరణలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో, భూసేకరణ చట్టం-2013 సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఏప్రిల్ 30న ఆమోదం తెలిపింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి, ఈ బిల్లును ఆమోదించారు.

భూసేకరణ చేసేప్పుడు ఎవరి వ్యక్తిగత ప్రయోజాలకు విఘాతం కల్గకూడదు అన్నది మొదటి సవరణ. 2014 జనవరి 1 నుంచి చట్టం అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత ఇవ్వాలిన్నది రెండో సవరణ. 2013 చట్టం ప్రకారం అత్యవసరం అనుకునే పనుల కోసం కలెక్టర్లు అవార్డు పాస్ చేసి భూ సేకరణ జరపవచ్చు. దానికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు. ప్రభుత్వ అనుమతి ఉంటే చాలు. దీన్ని తొలగించాలన్నది మూడో సవరణ. ఇలాంటి సవరణలు చేయడంతో బిల్లుకు ఆమోదం తెలిపింది కేంద్రం.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.