Monday, July 24, 2017
Home / Breaking News  / టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ఎన్నికల వివరాలను అధికారికంగా ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి పదహారో ప్లీనరీ సమావేశాలకు కొంపల్లిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ అధికార పీఠాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ కావడంతో ఈ మూడేళ్ల తమ పాలనలో జరిగిన అభివృద్ధి నివేదికను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ప్లీనరీ వేదికను ఉపయోగించుకోనున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.