Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / కేరళలో దేవాలయాలకు పూజారులుగా దళితులు , బీసీలు..!

కేరళలో దేవాలయాలకు పూజారులుగా దళితులు , బీసీలు..!

కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ బోర్డు ఆధ్వర్యంలో 1,248 దేవాలయాలు ఉన్నాయి. పలు దేవాలయాల్లో మొత్తం 62 మంది పూజారులను నియమించాలని బోర్డు సభ్యులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 26 మంది అగ్రకులాల వారిని, 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.వీరిలో ఆరుగురు దళితులు కూడా ఉన్నారు. దళితులను పూజారులుగా నియమించాలని నిర్ణ‌యం తీసుకోవ‌డం కేరళలో ఇదే తొలిసారి. ఆలయ పూజారుల నియామ‌కాల కోసం ఇప్ప‌టికే రాత పరీక్ష, ఇంటర్వ్యూలను పూర్తిచేశారు.ఈ ప్ర‌క్రియ‌లో ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని బోర్డు స‌భ్యులు తెలిపారు.

దీనిపై బోర్డు ప్రెసిడెంట్ పెరియార్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ… వెనుకబడిన వర్గాలు, దళితులను ఆలయ పూజారులుగా నియమించడం చాలా ముఖ్యమని, రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన జాబితా ప్రకారం నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. శబరిమల అలయంలో దళితులను పూజారులుగా నియమించాలనే పిటిషన్ హైకోర్టులో ఉందని, ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్రాహ్మణులను మాత్రమే నియమిస్తున్నామని అన్నారు. న్యాయస్థానం సూచనలతో తదుపరి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.