Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / కంచె ఐలయ్యను బెదిరించడాన్ని తాము ఖండిస్తున్నాం : మావోయిస్టు ప్రతినిధి జగన్

కంచె ఐలయ్యను బెదిరించడాన్ని తాము ఖండిస్తున్నాం : మావోయిస్టు ప్రతినిధి జగన్

హైదరాబాద్: కంచె ఐలయ్యను బెదిరించడాన్ని తాము ఖండిస్తున్నామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐలయ్య రాసిన విషయాలపై అభ్యంతరం ఉంటే చర్చించాలి కానీ.. వివాదం చేయడం సరికాదన్నారు. ఐలయ్య భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనా తీవ్ర విమర్శలు చేశారు. సంఘ్‌పరివార్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం హిందూ ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తోందని జగన్ విరుచుకుపడ్డారు. ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్ హత్య, కంచె ఐలయ్యపై దాడులు సంఘ్‌పరివార్ హత్యా రాజకీయాల్లో భాగమేనన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ తమ వర్గాన్ని ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారని విమర్శించారు. ఏపీ సీఎం ఏకంగా ఐలయ్య పుస్తకాన్నే లేకుండా చేస్తాననడం శోచనీయమన్నారు.

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే టైటిల్‌తో ఆర్యవైశ్యులను తప్పుపడుతూ కంచె ఐలయ్య పుస్తకం రాసిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనే గాక.. పలు చోట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సదరు పుస్తకాన్ని నిషేధించాలంటూ ఆర్యవైశ్యులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. కంచె ఐలయ్యపై దాడికి కూడా యత్నించారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.