Home / Breaking News  / అసెంబ్లీలో నేడు కాపులకు రిజర్వేషన్ల తీర్మానం , ఫలించిన కాపుల పోరాటం…

అసెంబ్లీలో నేడు కాపులకు రిజర్వేషన్ల తీర్మానం , ఫలించిన కాపుల పోరాటం…

అమరావతి: కాపు రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీల జాబితాలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీకి అనుగుణంగానే కాపులకురిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది.

ఇదిలా ఉంటే కాపుల 30 ఏళ్ల పోరాటం ఫలించింది. తమకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరుతున్న కాపుల చిరకాల వాంఛ నెరవేరింది. అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్ల తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. కేబినెట్‌లో కాపు రిజర్వేషన్లపై మంత్రివర్గం మరోసారి చర్చించి తీర్మానం చేయనుంది. కేబినెట్‌ అనంతరం జరిగే ఏపీ అసెంబ్లిలో ప్రభుత్వం కాపులను బీసీ ఎఫ్‌ కేటగిరీగా 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.

కేబినెట్‌ ఇవాళ మరోసారి సమావేశం కానుంది. ఉదయం 8.30 గంటలకు జరిగే సమావేశంలో కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్‌ నివేదికపై మంత్రివర్గం మరోసారి చర్చించనుంది. కమిషన్‌ నివేదికపై చర్చ అనంతరం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే నిరుద్యోగ భృతిపై కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోనుంది. బోయలను ఎస్టీల్లో చేర్చాలని మంత్రివర్గం తీర్మానం చేయనుంది. బోయలను ఎస్టీల్లో చేర్చాలని ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయనుంది. కాగా నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన మంజునాథ కమిషన్‌ నివేదికపై చర్చించి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.