Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / Breaking News  / లుచ్ఛాల పరిపాలలో తెలంగాణ…ఉత్తమ్‌ నాయకుడా, మూర్ఖుడా : తుమ్మల

లుచ్ఛాల పరిపాలలో తెలంగాణ…ఉత్తమ్‌ నాయకుడా, మూర్ఖుడా : తుమ్మల

హైదరాబాద్‌:ఏ లుచ్ఛాల పరిపాలలో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోంది? ఏ లఫంగులు తెలంగాణను పరిపాలిస్తున్నారు? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో మిర్చి రైతుకు లాఠీ ఛార్జీలు, పసుపు రైతుకు ఆత్మహత్యలే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్ష నేతలను తిట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని… ప్రజలకు, రైతులకు మేలు చేయడం ఆయనకు చేత కాదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ నేతలను తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు.

రెండు లక్షల బస్తాల మిర్చి ఖమ్మం మార్కెట్ యార్డులో ఉంటే ముఖ్యమంత్రి కనీసం స్పందించరా? అంటూ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో ముందు రైతుల పంటకు మద్దతు ధర గురించి మాట్లాడిన తర్వాతే… భూసేకరణ బిల్లుపై ముందుకు వెళ్లాలని చెప్పారు.

ఉత్తమ్‌ నాయకుడా, మూర్ఖుడా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తమ్ మూర్ఖుడయితేనే భూసేకరణకు తొందరేమిటని మాట్లాడతారన్నారు. భూసేకరణకు కచ్చితంగా తొందర ఉంటుందని, అందుకే ఆదివారమైనా అసెంబ్లీ పెడుతున్నామని తుమ్మల అన్నారు. ఎపుడు ఏ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే కనీస రాజకీయ పరిజ్ఞానం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతల శ్రీరంగ నీతులు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని, లుచ్చా, లఫంగి పాలనలో ఎపుడైనా ఇప్పుడిస్తున్న ధరలు రైతుల పంటల కిచ్చారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ, ఇప్పుడు తమ హయాంలో పంటలకు ఇచ్చిన మద్దతు ధరలపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ తుమ్మల విసిరారు. ఖమ్మం మిర్చి యార్డుపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇలాంటి దాడులు సరి కావన్నారు. రైతు సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్న తపన ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. అధికారం పోయిందనే దుగ్దతోనే విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.