Home / Breaking News  / రేషన్ డీలర్లను తొలగించేందుకు రంగం సిద్ధం

రేషన్ డీలర్లను తొలగించేందుకు రంగం సిద్ధం

హైదరాబాద్ : రేషన్ డీలర్ల సమ్మెను తీవ్రంగా పరిగణిస్తున్న పౌరసరఫరాల శాఖ.. డీడీలు కట్టకుండా రేషన్ సరుకులు పంపిణీ చేయని డీలర్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. అందుకు సంబంధించి జిల్లాల వారీగా డీలర్ల జాబితాను రూపొందించే ప్రక్రియను పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది.

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటి వరకు రేషన్ సరుకుల కోసం డీడీలు కట్టని డీలర్లకు శనివారం, డిసెంబర్ 2వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది పౌరసరఫరాల శాఖ. అప్పటికి కూడా డీడీలు కట్టని డీలర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. డీడీలు కట్టి సరుకులు పంపిణీ చేయని డీలర్ల జాబితాను రూపొందించాలని ఆదేశాలిచ్చారు. రేషన్ డీలర్ల సమ్మెను తీవ్రంగా పరిగణిస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్పష్టం చేశారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.