Home / Breaking News  / యాసిడ్ దాడిలో గాయపడ్డ మాధురి మ‌ృతి…నేడు పోస్టుమార్టం

యాసిడ్ దాడిలో గాయపడ్డ మాధురి మ‌ృతి…నేడు పోస్టుమార్టం

వరంగల్: యాసిడ్ దాడిలో గాయపడ్డ మాధురి మృతి చెందింది. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మాధురి ప్రాణాలుకోల్పోయింది. ఎంజీఎంలో మాధురి మృతదేహానికి నేడు పోస్టుమార్టం చేయనున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన మాధురికి వైద్యులు మెరుగైన వైద్యం అందించినప్పటికీ పరిస్థితి విషమంగా మారడంతో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా మాధురిని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి అనిరోజ్‌ క్రిస్టియాన్‌ సందర్శించి బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రెండు రోజుల క్రితం బోయిన మాధురి అలియాస్‌ మాధవిపై యాసిడ్‌ (తేజాబ్‌) దాడి చేసిన నిందితులు మిల్స్‌కాలనీ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో నిందితులైన మిల్స్‌కాలనీ పీఎస్‌ పరిధిలోని సాకరాసికుంటకు చెందిన ఆటోడ్రైవర్‌ చందు, అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు రాకేష్‌లతో పాటు ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన మరో స్నేహితుడు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

బుధవారం సాయంత్రం ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి సమీపంలోని చెట్లపొదల్లో మాధురి కాళ్లు చేతులు కట్టేసి కళ్లలో స్క్రూడ్రైవర్ తో పొడిచి నోట్లో శరీరంపై యాసిడ్ పోసిన విషయం తెలిసిందే .

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.