Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / బ్రహ్మా కుమారీస్ యోగ భట్టీని ప్రారంభించిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

బ్రహ్మా కుమారీస్ యోగ భట్టీని ప్రారంభించిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

కరీంనగర్:  ప్రజాపిత బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారి అధ్వర్యంలో నగరం లోని మాతా మాణిక్యేశ్వరి ఫంక్షన్ హాల్ లో రెండు రోజుల యోగ భట్టిని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాని, సంస్థ ముఖ్య కేంద్రమైన మౌంట్ ఆబూ నుండి బ్రహ్మా కుమార్ రాజు ముఖ్యఅథిగా పాల్గొన్నారు.బ్రహ్మా కుమరీస్ అనుబంధ సంస్థయైన రాజయోగ ఎజ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్ లోని గ్రామీణాభివృద్ధి విభాగానికి వైస్ చైర్మన్ గా వ్యహరిస్తున్నారు.ఈ కార్యక్రమానికి గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రారంభోత్సవంలో పాల్గొని  ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … వర్తమాన సమయం లో అందరు చాలా వేగంగా వెళ్తున్నారనీ, జీవన విధానాలే చాల వేగవంతమైపోతున్నాయని , దీని వల్ల చాలా రకాల దుష్పరిణామాలు కూడా వస్తున్నాయని అన్నారు.

స్ట్రెస్, బాధ వంటి దుష్పరినామాలను ఎదురుకోనేందుకు ఆధ్యాత్మిక సాధన చాల అవసరమని, మార్పు తో పాటు వచ్చే ఆధునీకరణను మనము తిరస్కరించలేమని, కాని దాని వల్ల వచ్చే నష్టాలను అధిగమించడానికి బ్రహ్మా కుమారీస్ నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా ఉపయోగకరమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం కూడా నిర్వహిస్తే వారికి ఇటువంటి విషయాలు జీవితాంతం పనికొస్తాయని సూచించారు.

ముఖ్యఅథి బ్రహ్మా కుమార్ రాజు గారు మాట్లాడుతూ రాజయోగాభ్యాసం వల్ల మనో వికారాలను జయించి ఆత్మను పవిత్రంగా చేసుకోవచ్చని అన్నారు. మన ఆలోచనల ప్రభావం ప్రక్రుతి పైన కూడా ఉంటుందని, అందుకే బ్రహ్మ కుమారీస్ శాశ్వత యోగ వ్యవసాయ ప్రణాలికను చేపట్టారాని చెప్పారు. ఈ వ్యవసాయ విధానం లో ప్రేమ పూర్వక మైన ఆలోచనల ప్రకంపనాలను భూమికి, విత్తనాలకు, నీటి కి అందించినపుడు పంట పై దాని ప్రభావం చాల చక్కగా ఉంటుందని అన్నారు.

ఈ వ్యవసాయ విధానం లో అతి తక్కువ కర్చు తో ఎక్కువ రాబడిని పొందవచ్చని, యోగాభ్యాసం వల్ల రైతుల మానసిక స్థితి కూడా మెరుగవుతుందని అన్నారు. ప్రస్తుతం 2000 మంది కి పైగా రైతులు దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అవలంబిస్తునారని చెప్పారు. ఈ విధానం వల్ల వచ్చిన పరిణామాలను శాస్త్రవేత్తలు కూడా గుర్తించారని, సూరత్ లో దంతేవాడ విశ్వవిద్యాలయం లో, ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్లో , మహారాష్ట్రలోని పర్భని లో శాశ్వత యోగ వ్యవసాయ విధానం పై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇటుకలను తయారు చేసేందుకు వాటిని భట్టీ లో పెట్టి కాల్చినట్లే, యోగ భట్టీ అనగా మన ఆత్మను పరమాత్మ స్మృతి అను యోగాగ్ని లో కాల్చి ఆత్మలోని మాలిన్యాన్ని, వికారాలను తొలగించి సద్గుణాలతో, ఈశ్వరీయ శక్తులతో ఆత్మను శక్తివంతం చేసుకోవడమే యోగ భట్టీ యొక్క ఉద్దేశ్యమని బ్రహ్మా కుమారీస్ కరీంనగర్ శాఖల సంచాలకులైన బీ. కే. విజయ అక్కయ్య గారు వివరించారు. ఆధ్యాత్మిక ప్రగతిని పరిశీలించుకునేందుకు ఇటువంటి యోగ భట్టీకార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటామని వారన్నారు.

ప్రారంభోత్సవం లో సిద్దిపేట బ్రహ్మ కుమారీస్ సంచాలకులు బీ.కే. భవాని అక్కయ్య, కార్యక్రమ సమన్వయకులు బీ.కే. మనీష, మీనాక్షి, పద్మ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం లో స్థానిక సేవాకేంద్రాల సభ్యులే కాక సిద్దిపేట్, సిరిసిల్ల, బెల్లంపల్లి, కాగజ్ నగర్ మరియు ఆసిఫాబాద్ కేంద్రాల సభ్యులు కూడా పాల్గొంటున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.