Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / పోలీస్‌ శాఖలో పదోన్నతులు , సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్

పోలీస్‌ శాఖలో పదోన్నతులు , సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: పోలీస్‌శాఖలో పదోన్నతులకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సంతకం చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి, న్యాయశాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో అనేక దఫలుగా చర్చలు జరిపి ఒకే సారి ఏకంగా 275 మందికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా, ఎఎస్పిలుగా, డిఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. దీంతో 1994 బ్యాచ్ వరకు ప్రతీ పోలీసు అధికారికి పదోన్నతి లభిస్తుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శనివారం రాత్రి సంతకం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 139 మంది సిఐలకు డిఎస్పీలుగా, 103 మంది డిఎస్పీలకు ఎఎస్పీలుగా, 33 మంది ఎఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 1994 బ్యాచ్ వరకు ఉన్న పదోన్నతి కోసం వేచి చూస్తున్న సీఐలందరికీ పదోన్నతి లభించనుంది. పదోన్నతులు కల్పించిన వారితో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అవసరమనుకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు కల్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

కాగా పోలీసు పదోన్నతుల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నదని చాలామంది అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా పలువురికి వినతులు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలోనే పదోన్నతుల విషయంలో వివక్ష, గందరగోళం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ సమస్యను పరిష్కరించి, పదోన్నతుల్లో పారదర్శకత పాటించాని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కూడా తీసుకుని వివాదాలకు తావులేని విధంగా సమస్యను పరిష్కరించారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.