Home / Breaking News  / నేటితో ముగియనున్న గురుకుల దరఖాస్తుల గడువు , ఓయూ సెట్ గడువు పొడిగింపు

నేటితో ముగియనున్న గురుకుల దరఖాస్తుల గడువు , ఓయూ సెట్ గడువు పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణలోని గురుకులాల్లో గల తొమ్మిది క్యాటగిరీల్లోని 7,306 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈ రోజుతో ముగియనున్నది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్ల దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 4వతేదీతో ముగిసినప్పటికీ అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు టీఎస్‌పీస్సీ ఈ నెల 9వతేదీ వరకు గడువు పెంచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూడు క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల ఎంపిక కోసం స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) ఈ నెల 31న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్పీ ఇదివరకే ప్రకటించింది.

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఓయూసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశోక్ తెలిపారు. ఈ నెల 11వతేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. రూ.200 అపరాధ రుసుముతో ఈనెల 15 వరకు, రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 22 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.

వారంలో గ్రూప్-2 మెరిట్ జాబితా
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 మెరిట్ జాబితాను మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ (1:2 నిష్పత్తిలో) మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్టు సమాచారం. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెలాఖరులో ధ్రువపత్రాల పరిశీలన, జూన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనునట్టు తెలుస్తున్నది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.