Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / దళితుల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది : ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

దళితుల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది : ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కుటుంబం మీద, టిఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లుతున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ను రాష్ట్రానికి తీసుకొచ్చి ఆమెతో అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరాకుమార్ హైదరాబాద్ లోని గాంధీభవన్ గ్రంథాలయానికి వెళ్లి పేపర్లు తిరగేస్తే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తాయని చెప్పారు. సంక్షేమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. దళితులపై దాడుల విషయంలో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టాల్సి వస్తే మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీయేనని కర్నె ప్రభాకర్ అన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇష్టం ఉన్నట్లు మాట్లాడటం, అబద్దాలు చెప్పడం అలవాటేనని చెప్పారు. కానీ మీరాకుమార్‌తో అబద్ధాలు చెప్పించడం దారుణమన్నారు. నేరెళ్లలో లారీ తగులబెట్టిన కేసులో 12 మంది నిందితులు.. వీరిలో కేవలం నలుగురు మాత్రమే దళితులు అని స్పష్టం చేశారు. మొత్తం 12 మంది దళితులని మీరాకుమార్ అసత్య ప్రచారం చేయడం బాధాకరమన్నారు. మీరాకుమార్‌ని టీఆర్‌ఎస్ గౌరవిస్తుందని తెలిపారు. మొత్తం దళితుల మీద దాడి జరిగినట్లుగా కాంగ్రెస్ చిత్రీకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.