Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / Breaking News  / త్యాగాల తెలంగాణ , మహాజన సమాజం కోసం పోరాటం : ప్రజాగాయకుడు గద్దర్‌

త్యాగాల తెలంగాణ , మహాజన సమాజం కోసం పోరాటం : ప్రజాగాయకుడు గద్దర్‌

హైదరాబాద్: త్యాగాల తెలంగాణ సాధన కోసం మహాజన సమాజం పోరాడుతుందని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో కలసి పనిచేస్తామా? లేదా? అనే విషయంపై త‌న నిర్ణ‌యాన్ని భ‌విష్య‌త్‌లో ప్ర‌క‌టిస్తాన‌ని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని సుందరయ్య కళా విజ్ఞాన్‌ భవన్‌లో మహా జన సమాజం సదస్సుకు హాజ‌రైన ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. ఇక త్యాగాల తెలంగాణ సాధన కోసం మహాజన సమాజం పోరాటం కొన‌సాగిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. తాము త్వ‌ర‌లోనే జిల్లాల వారీగా కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. భువ‌న‌గిరిలో 10 ల‌క్ష‌ల మందితో ఓ స‌భ నిర్వ‌హిస్తామ‌ని, ఆరు నెలల తర్వాత ఆ సభ ఏర్పాటు చేయాల‌నుకుంటున్నామ‌ని అన్నారు. తాము ఒక‌ ఉద్యమ సంఘంలా ఉండాలా? లేక ఓ రాజకీయ పార్టీగా ఉండాలా? అనే విషయాన్ని కూడా ఆలోచిస్తానని ఆయ‌న చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే జరిగిందని, దాని వల్ల ప్రయోజనం పొందింది మాత్రం చాలా తక్కువ మంది అని విప్లవ గాయకుడు గద్దర్ ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలో త్యాగాలు చేసినవారంతా ఏకమవుతారని త్యాగాల తెలంగాణ లాంటి ఒక పార్టీ ఏర్పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన బిడ్డలకు రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనం దక్కలేదన్నారు. తెలంగాణ వచ్చింది… మనకేం వచ్చిందని ప్రశ్నించుకోవాలన్నారు. అక్షరం అంటరానితనం నుంచి మనిషిని విముక్తం చేస్తుందని అంబేద్కర్‌ నమ్మారని పేర్కొన్నారు. మనిషిని మనిషిగా గుర్తించాలని ప్రశ్నించిన మహనీయుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.ఆయన రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్‌ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పాటు సాధ్యమయిందన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.