Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / చేనేత, మరమగ్గాల కార్మికులకు రూ.1000కోట్లు : సీఎం కేసీఆర్

చేనేత, మరమగ్గాల కార్మికులకు రూ.1000కోట్లు : సీఎం కేసీఆర్

రాజన్నసిరిసిల్ల \సిద్దిపేట జిల్లా : ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20లక్షలు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సిరిసిల్లలో జిల్లా కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, అపెరల్ పార్క్ లకు శంకుస్థాపన చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ…చేనేత, మరమగ్గాల కార్మికులకు రూ.1000కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడే చేనేత కార్మికుల పరిష్కారం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు. సిరిసిల్ల, దుబ్బాక, పోచంపల్లి, గద్వాల సహా ఎక్కడైనా సరే చేనేత కార్మికుల వెతలు తీరాలన్నారు.చేనేత కార్మికులకు 50శాతం సబ్సిడీ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.ప్రతి పవర్ లూమ్ కార్మికుడికి రూ.15వేలు వచ్చేలా చూస్తామన్నారు.

ప్రభుత్వాస్పత్రుల్లో గతంలో లక్షా 50వేల వరకు ప్రసవాలు జరిగేవన్నారు. కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4.80లక్షలకు ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు.  సిరిసిల్ల జిల్లా వెనుకబడ్డ ప్రాంతమన్నారు. కరువుతో అల్లాడిన ఈ జిల్లాను ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. బీడీ కార్మికులకు రూ.వెయ్యి భృతి ఇస్తున్నామ‌న్నారు.

రాష్ట్రంలో విద్యుత్ కోతలుండవని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ.8వేలు అందిస్తామన్నారు.తెలంగాణలో 31జిల్లాలు, 584 మండలాలు చేసుకున్నామన్నారు. ఎవరు ఏం చేసినా సరే…గోదావరి నీళ్లలో మీ పాదాలు కడుగుతామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు సరఫరా చేస్తామన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్సానపల్లిలో మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొండపాకలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో ప్రసంగించారు.

‘నాకు జన్మనిచ్చింది సిద్దిపేట.. రాజకీయ జన్మను కూడా ఇచ్చింది సిద్దిపేటనే. అనర్గళంగా మాట్లాడే గళం ఇచ్చింది..పోరాడే బలం ఇచ్చింది సిద్దిపేటే.. పలుకులు ఇచ్చి పదవులు ఇచ్చింది.. తెలంగాణను సాధించే ఆత్మశక్తినిచ్చింది సిద్దిపేటనే.. ఎల్లవేళల అండనిచ్చిన నా జన్మభూమి సిద్దిపేటకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా’ అని కేసీఆర్‌ అన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.