Home / Breaking News  / ’గురుకుల’ పరీక్షపై స్టే ఎత్తివేత

’గురుకుల’ పరీక్షపై స్టే ఎత్తివేత

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట కలిగింది.రాష్ట్రంలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. మహిళలకే అన్ని పోస్టులు కేటాయించారంటూ గతంలో కోర్టు స్టే విధించిన విషయం విదితమే. జులై 30న జరగాల్సిన పరీక్షను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళా డిగ్రీ కాలేజీల్లో పూర్తిగా మహిళలనే నియమించాలన్న నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ప్రభుత్వం తరుపున కోర్టుకు తాజాగా వివరణ ఇవ్వడంతో దానితో ఏకీ భవించిన కోర్టు స్టేను ఎత్తివేసింది. దీంతో డిగ్రీ కళాశాలల లెక్కరర్ల రాత పరీక్ష జరగనుంది. మరోపక్క, గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ నియామక పరీక్షలకోసం జారీ చేసిన జీవో 1274ను హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడంతో దీనిపై టీఎస్‌పీఎస్సీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరోపక్క, కొత్త షెడ్యూల్‌ను కూడా టీఎస్‌పీఎస్సీనే ప్రకటించాల్సి ఉంది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.