Monday, July 24, 2017
Home / Breaking News  / గంగపుత్రులు,ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండాలి : ఈటెల రాజేందర్‌

గంగపుత్రులు,ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండాలి : ఈటెల రాజేందర్‌

హైదరాబాద్: మత్స్యకారుల సంక్షేమానికి ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రులు ఈటెల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. వందశాతం సబ్సిడీపై చేపపిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అందరూ కలిసి ఐక్యంగా ముందుకుపోతేనే కులవృత్తులను కాపాడుకోగలుగుతామన్నారు. మరోసారి మత్స్యకారులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ను వారు కోరారు.

మత్స్యకారుల సంక్షేమానికి విధివిధానాలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగింది. తలసాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.