Home / Breaking News  / కరీంనగర్‌కు చేరిన సీఎం కేసీఆర్‌

కరీంనగర్‌కు చేరిన సీఎం కేసీఆర్‌

కరీంనగర్‌ : హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌కు వ‌చ్చారు. మూడు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నగరానికి చేరారు. బుధవారం ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా తీగలగుట్టపల్లికి వచ్చిన ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు అధికారులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సం తోష్‌రావు, పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బాల్క సుమన్‌తోపాటు పలువురు ఉన్నారు.

రేపు తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ ప్రాంతం, నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీ, సిరిపురం పంప్‌హౌస్, గోలివాడ పంప్‌హౌస్‌ను సీఎం సందర్శించనున్నారు. ఎల్లుండి మేడారం, రామడుగు దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, రాంపూర్ దగ్గర పంప్‌హౌస్ పనులు, మిడ్‌మానేరు పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.