Home / Breaking News  / ఓయూలో మళ్లీ ఉద్రిక్తత… పరీక్షలు , ఎంఈడీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా

ఓయూలో మళ్లీ ఉద్రిక్తత… పరీక్షలు , ఎంఈడీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక‍్త పరిస్థితులు.మురళి ఆత్మహత్యపై గత రాత్రి నుంచి యూనివర్సిటీ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం విద్యార్థులు మరోసారి ఆర్ట్స్‌ కాలేజీ వద్ద ఆందోళన చేట్టారు. మురళి కుటుంబానికి ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలంటూ డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ర్యాలీ చేపట్టగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. తోపులాట జరిగింది. విద్యార్థులు రాళ్లు రువ్వటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళ, బుధవారాల్లో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓయూ అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల నిర్వహణ తదుపరి తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు.

ఓయూ పరిధిలోని ఎంఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహిస్తున్న రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను వాయిదా వేస్తున్నామని అధికారులు ప్రకటించారు. తదుపరి తేదీని త్వరలో ఎస్‌ఎంఎస్, వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామన్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.