Home / Breaking News  / మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు సకల సౌకర్యాలు

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు సకల సౌకర్యాలు

జనవరి 31 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే స మ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులను నడపడానికి ఆర్టీసీ చర్యలు చేపట్టింది. 9న హైదరాబాద్ నుంచి లగ్జరీ బస్సులు నడుస్తాయని..ఆర్టీసీ అధికారులు తెలిపారు. పెద్దలకు రూ.310, పిల్లలకు 160 రూపాయలుగా టికెట్ ధరలను నిర్ణయించింది. హన్మకొండనుంచి పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.65 చార్జి ఉంటుందని తెలిపారు. టికెట్ల బుకింగ్ కు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఉదయం 5.45 నుంచి సాయంత్రం 4వరకు హైదరాబాద్ నుంచి బస్సులు తిరుగుతాయని తెలిపారు.

జనవరి 31 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే స మ్మక్క-సారలమ్మ మహాజాతరలో ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్ నుంచి క్లోరిన్ చేసిన వాటర్‌ను 543 బీవోటీల ద్వారా సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్‌ను, బీవోటీలను రెడీ చేస్తున్నారు. వీటికి తోడు అదనంగా ఈసారి మహాజాతరలో మిషన్ భగీరథ నుంచి గోదావరి జలాలను అందించటానికి అధికారులు నిర్ణయించారు.

మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేయడానికి అమ్మవార్ల గద్దెల పరిసరాల్లో వంద పుష్‌ట్యాప్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో పాటు వందమీటర్లకు ఒకటి చొప్పున 600ల ట్యాప్‌లు అమర్చాలనే ప్రతిపాదన కూడా అధికారుల పరిశీలనలో ఉంది. మొత్తానికి ఈ జాతరలో భక్తులకు మిషన్ భగీరథ నుంచి తాగునీరు సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు.

భక్తులకు గతంకంటే మెరుగైన వైద్యసేవలు అందించనున్నరు…జాతర పరిసరాల్లో విడిది చేసే భక్తుల సౌకర్యార్ధం చిలకలగుట్ట, జంపన్నవాగు, కొంగళమడుగు, శివరాంసాగర్ చెరువు, ఆర్టీసీ బస్టాం డ్, చింతల్ క్రాస్, ఊరట్టం, కన్నెపల్లి, కాల్వపల్లి, నార్లాపురం తదితర ప్రాంతాల్లో మొత్తం 14 క్యాంపులు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీ లించారు. భక్తులు అధికంగా విడిది చేసే ప్రాంతా లను గుర్తించి క్యాంపు ఏర్పాటుకు చర్యలు తీసుకో నున్నారు. గత జాతర కంటే మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ఆయా క్యాంపుల వద్ద సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి జాతర లో గర్భిణుల కోసం ల్యాబ్ రూంను ఏర్పాటు చే స్తున్నామని, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

మేడారంలోని తీతీదే క ళ్యాణ మండపంలోని వైద్యశాలతో పాటు జాతర పరిసరాల్లో మొత్తం 14 క్యాంపులను ఏర్పాటు చే స్తున్నారు. జాతరలో భక్తులకు స్కా నింగ్, అల్ట్రాసౌండ్ సిస్టం, అందుబాటులోకి తీసు కువస్తున్నారు. స్కానింగ్ డాక్టర్లు, ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుతామని, హార్ట్ స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉంటారని అధికారులు చెప్పారు. మహాజాతరలో మొత్తం 850 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తూ 24 గంటల పాటు భక్తులకు వైద్యసేవలు అందిన్చానున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.