Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / పెట్రోల్ బంకు డీలర్ల దేశవ్యాప్త సమ్మె విరమణ

పెట్రోల్ బంకు డీలర్ల దేశవ్యాప్త సమ్మె విరమణ

న్యూఢిల్లీ: త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ పెట్రోల్ బంకుల డీల‌ర్లు ఈ నెల 13న (ఎల్లుండి) స‌మ్మెను నిర్వ‌హించ‌నున్నామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో పాటు పలు కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా ఆయిల్ కంపెనీలు హెచ్చరికలు జారీ చేయడంతో పెట్రో డీలర్లు సమ్మెను విరమించుకున్నారు. అఖిల భారత పెట్రోలియం డీలర్స్ సంఘం అధ్యక్షుడు అజయ్ భన్సాల్ స్పందిస్తూ.. 13న చేపట్టనున్న దేశవ్యాప్త బంద్‌ను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. సమ్మె చేపట్టవద్దని అదేవిధంగా బంద్‌ను విరమించుకోవాల్సిందిగా మూడు ఆయిల్ కంపెనీలకు చెందిన డైరెక్టర్ చేసిన విజ్ఞప్తిపై స్పందించి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పెట్రోల్ బంకు ఒక్క‌రోజు మూత ప‌డుతుంద‌న్న ఆందోళ‌న‌లో వాహ‌న‌దారులు ఈ రోజు పెట్రోలు బంకుల వ‌ద్ద బారులు తీరి క‌నిపించిన విష‌యం తెలిసిందే. పెట్రోల్ బంకుల డీల‌ర్ల‌ అసోసియేష‌న్ త‌మ నిర్ణ‌యంపై వెన‌క్కి త‌గ్గ‌క‌పోతే రేపు అర్ధరాత్రి వరకు కూడా ఇదే సీను రిపీట్ అయ్యేది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.