Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / ఆధార్ డేటా అత్యంత సురక్షితం ఇలా….

ఆధార్ డేటా అత్యంత సురక్షితం ఇలా….

ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం, ఆర్థిక లావాదేవీలకు కూడా ఆధార్ నంబరు తప్పనిసరి చేయడంతో థర్డ్ పార్టీ చేతిలో పడుతున్న ఆధార్ డేటాను అత్యంత సురక్షితంగా ఉంచుకునే మార్గాన్ని ఆధార్ సంస్థ యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్ డేటాను అవసరమైనప్పుడు లాక్, అన్ లాక్ చేసుకునే విధానాన్ని తెలియజేసింది.

ఆధార్ వెబ్‌సైట్ యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్ లింక్‌పై లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్‌ను క్లిక్ చేయాలి. అలా చేయగానే http://resident.uidai.gov.in/biometric-lock పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో నిర్దేశించిన చోట ఆధార్ నంబరు, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ వెంటనే రిజస్టర్ మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీనిని ఎంటర్ చేసిన వెంటనే ఆధార్ వివరాలు లాక్ అయిపోతాయి. అంటే వేరెవరూ వాటిని చూడలేరన్నమాట. ఎవరైనా చూసేందుకు ప్రయత్నిస్తే పేజీపై ‘ఎర్రర్ కోడ్ 303’ అని చూపిస్తుంది. అంటే మన ఆధార్ వివరాలు భద్రంగా ఉన్నట్టు లెక్క. ఇలా లాక్ చేసుకోవడం వల్ల మొబైల్ ఆపరేట్లు, ఇతర సంస్థలు మన డేటాను దొంగిలించలేవు. ఒకవేళ ఎవరికైనా అనుమతి ఇవ్వాలంటే మాత్రం ఇంతకుముందు చేసినట్టుగానే ఆన్‌లాక్ చేయవచ్చు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కుటుంబ సభ్యుల ఆధార్ సమచారం లీకైనట్టు ఇటీవల వార్తలు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ డేటా లీక్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.