Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / ఆక్సిజన్ అందకే 30 మంది చిన్నారుల మృతి… వెంటిలేటర్ పై మరో 48 మంది చిన్నారులు

ఆక్సిజన్ అందకే 30 మంది చిన్నారుల మృతి… వెంటిలేటర్ పై మరో 48 మంది చిన్నారులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 48గంటల్లో 30మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరంతా మెదడు వాపు వ్యాధి కారణంగా చికిత్స పొందుతున్నవారే. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ సొంత నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.అయితే, ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందకే వారంతా చ‌నిపోయిన‌ట్లు తెలిసింది. త‌మ‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫరా చేస్తున్న కంపెనీకి ఆ ఆసుప‌త్రి రూ.66లక్షల బాకీ ఉంది. ఆ బిల్లు చెల్లించ‌డంలో జాప్యం చేస్తుండ‌డంతో ఆ కంపెనీ ఆసుప‌త్రికి ఆక్సిజన్‌ పంపిణీని నిలిపివేసింది. ఈ కార‌ణంగానే ఏకంగా 30 మంది అభం శుభం తెలియ‌ని చిన్నారులు మృత్యువాత‌పడ్డారు. అంతేగాక‌, అదే ఆసుప‌త్రిలో మరో 45మంది చిన్నారులు వెంటిలేషన్‌పై ఉన్నారని స‌మాచారం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజక వర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.