Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / రాయలసీమలో కరవు లేకుండా శాశ్వత పరిష్కారం : చంద్రబాబు

రాయలసీమలో కరవు లేకుండా శాశ్వత పరిష్కారం : చంద్రబాబు

అమరావతి: ప్రజలు సంతోషంగా ఉంటే అన్ని ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని, మరో పార్టీకి రాష్ట్రంలో అవకాశం ఉండదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన గృహనిర్మాణంపై చర్చ నిర్వహించారు. అందరికీ ఇళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్న చంద్రబాబు, కొంతమందికి ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదని చెప్పారు.

రాయలసీమలో కరువు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే అన్ని ఎన్నికలు మనకు ఏకపక్షమేనని, మరో పార్టీకి రాష్ట్రంలో అవకాశం ఉండదని చంద్రబాబు అన్నారు. కాగా… టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో గృహ నిర్మాణంపై చర్చ జరిగింది. అందరికీ ఇళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం అన్నారు. ఇళ్ళు మంజూరైనా కొందరు కట్టుకునేoదుకు ముందుకు రావడం లేదని, ఇళ్లు కట్టుకునే వారికి ముందు ఇద్దామని చంద్రబాబు అన్నారు.ఈ సందర్భంగా అనంతపురంలో వరదల గురించి ఆయన ప్రస్తావించారు. అనంతలో వరదలు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని, రాయలసీమలో కరవు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.