Monday, July 24, 2017
Home / Breaking News  / మెట్రో రైల్లో ప్రయాణం చేసిన వైఎస్‌ జగన్‌ ,800 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పచ్చజెండా

మెట్రో రైల్లో ప్రయాణం చేసిన వైఎస్‌ జగన్‌ ,800 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పచ్చజెండా

న్యూఢిల్లీ : వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్… విమానాశ్రయం నుంచి శివాజీ స్టేడియం వరకు మెట్రో రైల్లో వెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి ప్రధాని నివాసానికి కారులో వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు ఉన్నారు. అనంతరం మోదీతో భేటీ అయిన జగన్ రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రైతు సమస్యలపై చర్చించారు.

మావోయిస్టు ప్రభావిత నాలుగు జిల్లాల్లో అదనపు పోలీస్ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకోసం 800 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనుందని సమాచారం.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.