Home / Breaking News  / ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వేంకటేశ్వరస్వామి దేవుడు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వేంకటేశ్వరస్వామి దేవుడు

ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా నియమించడంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు.టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడం పెద్ద చర్చనే లేవదీసింది. ఉత్తరాది అధికారిని నియమించడం ద్వారా దక్షిణాది ప్రజల మనోభావాలను గాయపరిచారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వారణాసి, మధుర, అమర్ నాథ్ లాంటి పవిత్ర ఆలయాల్లో దక్షిణాది అధికారులను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు.

ఇదే విషయంపై ప్రముఖ నటుడు మోహన్ బాబు తాజాగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ శ్రీవేంకటేశ్వరస్వామి దేవుడని… ఒక ప్రాంతానికో, ఒక భాషకో ఆయనను పరిమితం చేయడాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. తెలుగు భాష రాకపోవడం ఒక్కటే సమస్య కాదని తెలిపారు. సింఘాల్ చాలా సమర్థత కలిగిన అధికారి అని కితాబిచ్చారు.

facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.