Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / చేతకాని దద్దమ్మ , మహిళా వ్యతిరేకి చంద్రబాబు : రోజా

చేతకాని దద్దమ్మ , మహిళా వ్యతిరేకి చంద్రబాబు : రోజా

విజయవాడ: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపే అర్హత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. టీడీపీ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణే లేకుండా పోయిందని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందంటూ సాక్షాత్తు టీడీపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు చెప్పుకున్నప్పటికీ, కాపాడుకోలేక పోయిన చేతకాని దద్దమ్మ చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని మహిళలంతా కలిసి చీల్చి చెండాడాలని… అప్పుడే మహిళలంతా కనీసం పట్టపగలైనా రోడ్డుపై నడిచే అవకాశం ఉంటుందని చెప్పారు.

మహిళను రక్షించడంలో ఘోరంగా విఫలమైన చేతకాని ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సూదిగాళ్ల పాలన నడుస్తుందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలు అర్ధరాత్రి కాదు.. పట్ట పగలు కూడా నడవలేయపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాలకేయుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.