Home / Breaking News  / కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన , సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక

కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన , సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక

విశాఖ: దక్షిణ అండమాన్‌కు ఆనుకొని ఆగ్నేయ బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. 48 గంటల్లో అది మరింతగా బలపడే అవకాశం ఉంది. మచిలీపట్నానికి 1160 కి.మీ దూరంలో దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఆంధ్రా తీరం దిశగా వాయుగుండం కదులుతోంది. కోస్తా తీరం అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రానున్న 3 రోజులు తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.