Home / Breaking News  / కాపుల రిజర్వేషన్ పై భగ్గుమంటున్న బీసీ సంఘాలు

కాపుల రిజర్వేషన్ పై భగ్గుమంటున్న బీసీ సంఘాలు

అమరావతి: బీసీలను సామాజికంగా అణిచి వేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిం దని రాష్ట్ర బీసీ నాయకులు ధ్వజమెత్తారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానాన్ని ఆమోదించడంపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో చెప్పాలంటూ, గుంటూరు, కాకినాడ, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో బడుగులు రోడ్డెక్కారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనలకు దిగారు.

కాపులకు రిజర్వేషన్ అంశంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను తెచ్చి వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. తక్షణం ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకుంటే తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, దీని కారణంగా వెనుకబడిన సామాజిక వర్గీయులు నష్టపోతారని, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో చంద్రబాబు దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.