Home / Breaking News  / అపోలో ఆసుపత్రికి చేరుతున్న మంత్రి నారాయణ బంధువులు

అపోలో ఆసుపత్రికి చేరుతున్న మంత్రి నారాయణ బంధువులు

హైదరాబాద్: హైదరాబాదులోని జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36 లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన కారు (నెంబర్ టీఎస్ 07 ఎస్ కే 7117) ప్రమాదంలో మృతి చెందిన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవివర్మల భౌతికకాయాలు అపోలో ఆసుపత్రిలో ఉండడంతో బంధువులు ఆసుపత్రికి చేరుతున్నారు. ఈ ఆకస్మిక ఘటనతో వైజాగ్ నుంచి హైదరాబాదుకు నారాయణ వియ్యంకుడు మంత్రి గంటా శ్రీనివాసరావు హుటాహుటీన బయల్దేరారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప రాజమండ్రి నుంచి హైదరాబాదు బయల్దేరారు. నారాయణ సన్నిహితులు పలువురు హైదరాబాదు పయనమయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉండగా, నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దీంతో హైదరాబాదులోని టీడీపీ శ్రేణులు అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నాయి.

కాసేపట్లో పోస్టు మార్టం పూర్తైన అనంతరం నిషిత్ నారాయణ మృతదేహాన్ని జూబ్లిహిల్స్ లోని నారాయణ నివాసానికి తీసుకెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి నెల్లూరు తరలిస్తారు. మరోపక్క, లండన్ పర్యటనలో ఉన్న నారాయణ అక్కడి నుంచి బయల్దేరారు. నేటి సాయంత్రం 8 గంటలకు ఆయన చెన్నై చేరుకోనున్నారు. అనంతరం నేరుగా ఆయన నెల్లూరు పయనమవుతారు. రేపు ఉదయం నెల్లూరులో నిషిత్ నారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.