Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఆర్కే రోజా

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఆర్కే రోజా

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న’లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో నటి, వైసీపీ నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా కూడా నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు.చిత్ర నిర్మాత అయిన వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంటికి (పలమనేరు) ఈరోజు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇందులో అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, చిత్ర నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా వెనుకాడబోమని అన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడకుండా సినిమాను నిర్మిస్తామని తెలిపారు.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమాను ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేసిన వర్మ, తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరులో సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేశారు.

2018లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. అక్టోబర్ నాటికి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదన్న వర్మ, తమ సినిమాలో కేవలం ఒక అధ్యాయాన్ని మాత్రమే చూపిస్తామని తెలిపారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా మొదలవుతుందని తెలిపారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.