Monday, July 24, 2017
Home / Breaking News  / నిహారికను చెల్లెలుగా భావిస్తా : సాయిధరమ్ తేజ్

నిహారికను చెల్లెలుగా భావిస్తా : సాయిధరమ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి ఈ మద్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్, నాగబాబు కుమార్తె నిహారిక, సాయిధరమ్‌తేజ్‌లకు త్వరలో వివాహం జరగనుందని వచ్చిన వార్తలను సాయిధరమ్ తేజ్ ఖండించారు. నిహారికను తాను చెల్లెలిగా భావిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ప్రతినిధి ద్వారా ఓ ప్రకటన విడుదల చేయించారు. ఈ వార్తలతో సాయి తీవ్రంగా కలత చెందారని, నిహారిక, తాను అన్నాచెల్లెళ్లు మాదిరి ఒకే కుటుంబంలో కలిసి పెరిగామని పేర్కొన్నారు. ఒక అమ్మాయికి సంబంధించి ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు స్పష్టంగా తెలుసుకోకపోతే, అవి మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా సినీ హీరోయిన్ గా పరిచయమైంది.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.