Home / వార్తలు  / జాతీయం

అలహాబాద్‌: అఖిల భారతీయ ఆకార పరిషత్‌ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేసింది.స్వయం ప్రకటిత దేవుళ్లుగా ప్రకటించుకుంటున్న వారి వల్ల మొత్తం సాధు సంతులుకు చెడ్డపేరు వస్తోందని అఖిల భారతీయ అఖాడా పరిషత్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 14 మంది దొంగ బాబాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్

READ MORE

పట్నా : బెంగళూరులో ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య ఉదంతం మరవక ముందే బిహార్‌లో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అరవల్‌లో గురువారం జర్నలిస్ట్‌ పంకజ్‌ మిశ్రాపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ పంజక్‌ మిశ్రా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు.

READ MORE

యూపీ: వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన ఉత్తర ప్రదేశ్ లో మరో రైలు పట్టాలు తప్పింది. రైల్వే శాఖా మంత్రిగా సురేష్ ప్రభు నుంచి పీయుష్ గోయల్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి ప్రమాదం ఈ ఉదయం జరిగింది. హౌరా నుంచి జబల్ పూర్ వెళ్లే శక్తి కుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద ప్రమాదానికి గురైంది. రైలుకు చెందిన ఏడు

READ MORE

హర్యాణాలోని డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ ఆశ్రమంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో డేరా ప్రైవేటు సైన్యం బయటపడింది. 33 అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డేరాలో తవ్వినకొద్ది బయటపడుతున్నాయి అక్రమాలు. 85 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. డేరా బాబాను జైల్లో వేశాక ఆశ్రమంలో అణువణువు గాలిస్తున్నారు. ఆశ్రమం నుంచి ఇప్పటికే కొంత మంది

READ MORE

ఉత్తరాదిన వరద పరిస్థితి మరింత దిగజారింది. యూపీలో వరదల బారిన పడి ఇంతవరకూ మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోయారు. యూపీలో 22 జిల్లాల్లో వరద పరిస్థితి కొనసాగుతుందని, 2,013 గ్రామాల్లో 14.5 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారని రాష్ట్ర అధికారులు తెలిపారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వరద బీభత్సంతో రైల్వేకు దాదాపు రూ. 150 కోట్ల నష్టం వాటిల్లిందని

READ MORE

చెన్నై: తమిళనాడు రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎలాగైనా అన్నాడీఎంకేలో శశికళ వర్గానికి చెక్ పెట్టాలన్న వ్యూహంతో సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వంలు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దివంగత సీఎం జయలలిత మృతిపై జుడీషియల్ విచారణకు సీఎం పళనిస్వామి ఆదేశించారు. రిటైర్డ్ జడ్జీతో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలపై విచారణ జరపడానికి రిటైర్డ్ న్యాయమూర్తి

READ MORE

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 48గంటల్లో 30మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరంతా మెదడు వాపు వ్యాధి కారణంగా చికిత్స పొందుతున్నవారే. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ సొంత నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.అయితే, ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందకే వారంతా చ‌నిపోయిన‌ట్లు తెలిసింది. త‌మ‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫరా చేస్తున్న కంపెనీకి ఆ ఆసుప‌త్రి రూ.66లక్షల బాకీ ఉంది. ఆ

READ MORE

ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం, ఆర్థిక లావాదేవీలకు కూడా ఆధార్ నంబరు తప్పనిసరి చేయడంతో థర్డ్ పార్టీ చేతిలో పడుతున్న ఆధార్ డేటాను అత్యంత సురక్షితంగా ఉంచుకునే మార్గాన్ని ఆధార్ సంస్థ యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్ డేటాను అవసరమైనప్పుడు లాక్, అన్ లాక్ చేసుకునే విధానాన్ని తెలియజేసింది. ఆధార్ వెబ్‌సైట్ యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్ లింక్‌పై లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్‌ను

READ MORE

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాన్వాయిపై పలువురు దాడికి దిగారు.వరద బాధితులను పరామర్శించేందుకు రాహుల్ గురువారం గుజరాత్ వెళ్లారు.అందులో భాగంగానే ఆయన ఈరోజు బనస్కంత అనే ప్రాంతానికి వెళ్లారు. కాగా.. ఆయన కారుపై పలువురు రాళ్లతో దాడి చేశారు. దాడి సమయంలో రాహుల్ కారులో లేరు. రాహుల్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ.. ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది గాయాలపాలైనట్లు

READ MORE

న్యూఢిల్లీ: చ‌నిపోయిన వారి వివ‌రాల‌ను న‌మోదు చేయ‌డానికి ఆధార్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. అక్టోబ‌ర్ 1 నుంచి ఈ ఉత్త‌ర్వులు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. జ‌మ్మూ కాశ్మీర్‌, అస్సాం, మేఘాల‌య రాష్ట్రాల‌కు మిన‌హా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఈ నియ‌మం వ‌ర్తిస్తుంద‌ని హోం మంత్రిత్వ శాఖ తెలియ‌జేసింది. ఆధార్ గుర్తింపులో అవ‌క‌త‌వ‌క‌ల‌ను తొల‌గించ‌డానికే ఈ

READ MORE