Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / వార్తలు  / క్రైమ్

కరీంనగర్: నకిలీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కరీంనగర్‌లో దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారి నుంచి రూ.6.50 ల‌క్ష‌ల‌ విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన ముఠా సభ్యుల వివరాలు

READ MORE

కరీంనగర్ : జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలంలోని అలుగునూరు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ ఉదయం 6 గంటల సమయంలో మృతి చెందాడు.

READ MORE

కరీంనగర్: జిల్లాలోని కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలోని ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను పాలవ్యాను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు చామనపల్లి వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్

READ MORE

వరంగల్‌: హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్‌ను అతి దారుణంగా నరికి చంపేశారు. వ‌రంగ‌ల్‌ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధి కుమార్ ప‌ల్లిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇటీవ‌లే ఆయ‌న టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వ‌చ్చారు. ప‌లువురు దుండ‌గులు వేట‌ కొడ‌వ‌ళ్లు, క‌త్తుల‌తో వ‌చ్చి ముర‌ళీపై విచక్ష‌ణారహితంగా దాడి చేశారు. దీంతో ముర‌ళీ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ హ‌త్య‌కు

READ MORE

భూపాలపల్లి  జయశంకర్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  మహదేవ్‌పూర్ జింకల వేట కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం పరిసరాల్లో అజ్ఞా‍తంలో ఉన్న ఏ4 నిందితుడు  , హంటర్‌ మున్నాలను సీఐ చంద్రభాను నేతృత్వంలో పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మార్చి 19వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటనలో పాల్గొన్న వారి కోసం విస్తృతంగా గాలింపు చేపట్టిన

READ MORE

తిమ్మాపూర్‌: ధ్వజస్తంభం విరిగిపడి ఇద్దరు భక్తులు మృతి చెందిన సంఘటన మండలంలోని నేదునూరులో చోటు చేసుకుంది. శనివారం యాలాల మల్లన్న దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభం విరిగిపడడంతో నేదునూరు గ్రామానికి చెందిన మల్లెత్తుల మొండవ్వ, తమిళనాడుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు శంకర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో భక్తునికి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. భక్తులు మృతి

READ MORE

హైదరాబాద్‌: కన్న బిడ్డ ఆనారోగ్యంతో బాధపడుతుంటే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి విచక్షణ మరచింది. మూడేళ్ల చిన్నారి విరేచనాలతో ఇబ్బంది పెడుతుంటే పట్టించుకోకపోగా.. అట్లకాడ కాల్చి వాతలు పెట్టింది. పసికందు ఏడుస్తున్నా కర్కశంగా సుమారు 30 చోట్ల వాతలు పెట్టింది. ఈ ఘటన శనివారం విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేటలో జరిగింది. సౌకత అలీ, ఆష్మ దంపతులకు ఖాజాబాబా(5), షర్మిల(3) ఇద్దరు సంతానం.

READ MORE

కరీంనగర్‌: కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కోటి రాంపూర్‌లోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా సోదా చేశారు. ఈ తనిఖీలో 24 బైక్‌లు, ఒక ఆటో, 8మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలను అమ్మడం కాని కొనడం కాని చేయకూడదన్నారు. అటువంటి

READ MORE

కరీంనగర్: గ్రానైట్‌ క్వారీల నిర్వాహకులు పేలుడు పదార్థాల లైసెన్సులు తప్పని సరిగా కలిగి ఉండాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి కమలాసన్‌రెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలోని గ్రానేట్‌ క్వారీల నిర్వాహకులతో శనివారం కమిషనరేట్‌ కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియమ నిబంధనలకు లోబడి క్వారీలు నిర్వహించాలని,

READ MORE

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం నర్సింగపూర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వ‌హించారు. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో వేకువజాము నుంచే 300 మంది పోలీసులు తనిఖీలు చేప‌ట్టారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో వీణవంక మండలం నర్సింగాపూర్‌లో జరిగిన ఈ నిర్బంధ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 బైక్‌లు, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 వేలు విలువ చేసే గుట్కాప్యాకెట్లు,

READ MORE