Monday, July 24, 2017
Home / వార్తలు  / ఆంద్ర ప్రదేశ్

అమ‌రావ‌తి: మద్యం బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాల‌ని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. రాజ‌ధాని అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తీసుకున్న నిర్ణ‌యాల గురించి మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివ‌రించారు. ఆ వివరాలు .. రేప‌టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల మూసివేత‌కు కేబినెట్‌ ఆదేశాలు జారీ చేసింది.

READ MORE

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది.భారత 14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి ఓటును చంద్రబాబు వేయగా, రెండో ఓటును స్పీకర్ వేశారు. అన్ని పార్టీలకు సంబంధించి 175

READ MORE

విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ‌లోని తుమ్మ‌లప‌ల్లి క‌ళాక్షేత్రంలో నిర్వ‌హించిన కేఎల్ రావు జ‌యంతి వేడుక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేఎల్ రావు స‌మాజానికి చేసిన సేవల‌ను గుర్తు చేశారు. త‌మ ప్ర‌భుత్వం పోలవరాన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతుంద‌ని చెప్పారు. పోల‌వ‌రం పూర్తి చేసి రాష్ట్రంలో క‌ర‌వు లేకుండా చేయ‌డమే త‌మ‌ ల‌క్ష్యమ‌ని అన్నారు. నదుల్లోని నీటిని

READ MORE

కర్నూలు: కర్నూల్ లో ఐటి మంత్రి లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది..రాయల సీమకు భారీగా పరిశ్రమలొ చ్చాయని, తమ పనితీరు కారణంగానే పెట్టుబడులొస్తున్నాయని మంత్రి లోకేష్ అన్నారు.. కియా మోటార్స్ కంపెనీ రాకతో 5 లక్షలమంది స్థానికులకు ఉద్యోగాలోచ్చాయని మంత్రి చెప్పడంతో స్థానికులు తీవ్రంగా స్పందించారు.అయిదు లక్షల ఉద్యోగాలు కాదు.. ఒక్క ఉద్యోగం చూపించడంటూ నిలదీశారు.మీ నాయకుడి ముందు మీరు ఎలాగూ

READ MORE

గుంటూరు: ఆరుగాలం శ్రమించి అనేక కష్టనష్టాలకోర్చి అందరి ఆకలి తీరుస్తున్న అన్నదాతను ఆదుకునేందుకు తాము అధికారంలోకి రాగానే 'వైఎస్సార్ భరోసా' కింద రైతులను ఆదుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు అందరికీ రూ.50 వేలు ఇస్తామని, ఈ మొత్తాన్ని ప్రతి ఏటా నాలుగు విడతల్లో రూ. 12,500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఈ మొత్తాన్నినేరుగా రైతుల

READ MORE

అమరావతి: మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మరో వివాదంలో ఇరుక్కున్నారు. గుంటూరులో ఎమ్మార్పీఎస్ నిర్వహించతలపెట్టిన 'కురుక్షేత్రం' సభకు రావెల ఆహ్వానం పలుకుతున్నట్టు గుంటూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇది వివాదాస్పదమైంది. మంద కృష్ణ మాదిగ సభపై అధికారపార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రావెల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. కాగా, రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా

READ MORE

గిరిజనులకు కనీస సౌకర్యాలు అందడం లేదంటూ  ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జ‌గ‌న్‌

READ MORE

ఎన్డీఏ తమ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్ కోవిద్ పేరును ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఫోన్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రామ్‌నాథ్ కోవిద్‌కు మ‌ద్ద‌తిస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. మోదీ సూచ‌న మేర‌కు అనంత‌రం ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి ఫోన్ చేశారు. ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు విష‌యంలో ఆయ‌న మాట్లాడారు. రామ్‌నాథ్

READ MORE

అమరావతి: టీడీపీ జిల్లా విభాగాలకు కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం ప్రకటించారు. ఆయన ప్రకటించిన జాబితా ప్రకారం.. శ్రీకాకుళం-గౌతు శిరీష, విజయనగరం-చిన్నమనాయుడు, విశాఖ అర్బన్‌- వాసుపల్లి గణేష్‌, విశాఖ రూరల్‌- పంచకర్ల రమేశ్‌బాబు, తూర్పుగోదావరి-నామన రాంబాబు, పశ్చిమ గోదావరి-తోట సీతారామలక్ష్మి, కృష్ణా-బచ్చుల అర్జునుడు, గుంటూరు-జీవీఎస్‌ ఆంజనేయులు, ప్రకాశం-దామచర్ల జనార్దన్‌, నెల్లూరు-బీద రవిచంద్రయాదవ్‌, చిత్తూరు-వెంకటమణి ప్రసాద్‌, కడప-శ్రీనివాసులు

READ MORE

విజయవాడ: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు టీడీపీ ప్రకటించింది. అమరావతిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై సమన్వయ కమిటీ చర్చించి, పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా సమావేశ వివరాలు మంత్రి కళావెంకట్రావు వెళ్లడిస్తూ, హైదరాబాదులో భూకబ్జాలకు పాల్పడిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

READ MORE