Monday, July 24, 2017
Home / వార్తలు

కరీంనగర్: కరీంనగర్ లో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంబించారు. కార్య‌క్ర‌మంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, న‌గ‌ర మేయ‌ర్, పార్టీ నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ

READ MORE

న్యూఢిల్లీ: ఊహించిన‌ట్లే రామ్‌నాథ్ కోవింద్ భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌య్యారు. 65.65 శాతం ఓట్ల‌తో మీరాకుమార్‌పై బంప‌ర్ మెజార్టీతో ఆయ‌న విజ‌యం సాధించారు. మీరా కుమార్ 34.35 శాతం ఓట్ల‌తో స‌రిపెట్టుకున్నారు. మెజార్టీ రాష్ట్రాల్లో రామ్‌నాథ్ కోవింద్‌కే స్ప‌ష్ట‌మైన ఆధిక్యం ల‌భించింది. రామ్‌నాథ్‌కు 7,02,044 ఓట్లు రాగా.. మీరాకుమార్‌కు 3,67,314 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్‌

READ MORE

న్యూఢిల్లీ: టిబెట్ స‌రిహ‌ద్దులో సైన్యాన్ని మోహ‌రిస్తూ.. ఇండియాను భ‌య‌పెట్ట‌డానికి చూస్తున్న చైనా తీరుపై కేంద్ర విదేశాంగ‌శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ స్పందించారు.భారత్ తనను తాను రక్షించుకోగలదని స్పష్టం చేశారు. కనీస స్థాయిలోనైనా భయపడబోదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. భారతదేశం-భూటాన్-చైనా ట్రై జంక్షన్‌ వద్ద పరిస్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని చెప్పారు. తనను తాను కాపాడుకోగల శక్తిసామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయన్నారు.

READ MORE

హైదరాబాద్ లోని మ‌హాత్మ‌గాంధీ బ‌స్‌స్టేష‌న్ ( ఎంజీబీఎస్) నుంచి రాష్ట్రంలోని నలుమూలలకే కాకుండా, పొరుగు రాష్ట్రాలకూ బస్సులు అధిక సంఖ్యలో నడుస్తూ ఉంటాయి. ప్ర‌తి రోజూ వందలాది మంది ప్ర‌యాణికులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతుంటారు. అయితే, బ‌స్‌స్టేష‌న్ ఆధునికీకరణ‌లో భాగంగా ఫ్లాట్ ఫామ్ నెంబర్లలో కొన్ని మార్పులు జ‌రిగిన‌ట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీని ప్రకారం కొత్త ప్లాట్ ఫామ్

READ MORE

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టయింది. వెస్ట్, నార్త్ జోన్‌లో 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ రాకెట్ వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి వెల్లడించారు. ప్రెస్ మీట్‌లో టాస్క్‌ఫోర్స్ డీసీపీ మాట్లాడుతూ డ్రగ్స్ రాకెట్ లో ఇద్దరు నైజీరియన్లు సహా 9 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల్లో ఇద్దరు ఆఫ్రికన్లు ఉన్నారు. వీరి నుంచి 300 గ్రాముల కొకైన్

READ MORE

న్యూఢిల్లీ: చైనా భారీగా ఆయుధసంపత్తిని, ఆర్మీ వాహనాలను, బలగాలను టిబెట్‌కు తరలించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. టిబెట్ లోని పర్వత ప్రాంతాలకు భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తరలిస్తున్న చైనా రక్షణ శాఖ నిశ్శబ్దంగా యుద్ధానికి సిద్ధమవుతోందని చైనా మిటలరీ అధికార పత్రిక 'పీఎల్ఏ డెయిలీ' సంచలన కథనాన్ని నేడు ప్రచురించింది. సిక్కింలోని డోక్లాం సమీపంలో సముద్ర మట్టానికి 5 వేల

READ MORE

అమ‌రావ‌తి: మద్యం బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాల‌ని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. రాజ‌ధాని అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తీసుకున్న నిర్ణ‌యాల గురించి మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వివ‌రించారు. ఆ వివరాలు .. రేప‌టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల మూసివేత‌కు కేబినెట్‌ ఆదేశాలు జారీ చేసింది.

READ MORE

రష్యాలోని బేరింగ్‌ ఐలాండ్‌ సముద్రతీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నయోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తొలుత 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం.. కొద్ది క్షణాల్లోనే 7.8 తీవ్రతకు చేరుకుందని తెలిపాయి. సముద్రంలో పది కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పాయి.భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో భారీ సునామీ సంభవించే అవకాశం ఉందని

READ MORE

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం, కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది. నిన్న 84,829 మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారు. 33,331 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి

READ MORE

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. అందరూ ఊహించినట్టే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకే చాన్స్‌ దక్కింది.ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు అన్ని విధాలా అర్హులని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరును అధికారికంగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఎన్డీఏ మిత్రపక్షాలు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్

READ MORE