Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / జియో ఫోన్ కు ఎయిర్ టెల్ షాక్…రూ. 1399 కే 4జీ స్మార్ట్ ఫోన్

జియో ఫోన్ కు ఎయిర్ టెల్ షాక్…రూ. 1399 కే 4జీ స్మార్ట్ ఫోన్

జియోకు షాకిచ్చేలా ఎయిర్ టెల్ అతి తక్కువ ధరకే తన 4జీ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. కేవలం రూ. 1399కే 4జీ స్మార్ట్ ఫోన్ ను అందిస్తున్నామని తెలిపింది. కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంతో ఈ ఫోన్ ను అందిస్తున్నట్టు పేర్కొంది. 4జీ స్మార్ట్‌ఫోన్‌ ధర, ఫీచర్‌ ఫోన్‌ ధర ఒకేలా ఉంచేలా తన స్మార్ట్‌ఫోన్‌ను ఎయిర్‌టెల్‌ రంగంలోకి దింపింది.

ఆండ్రాయిడ్‌ ఆధారితంగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫుల్‌ టచ్‌ స్క్రీన్‌ అనుభవం, డ్యూయల్‌ సిమ్‌ స్లాట్లు, యూట్యూట్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి పాపులర్‌ యాప్స్‌ సపోర్టును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పేరు కార్బన్‌ ఏ40 ఇండియన్‌గా నిర్ణయించినట్టు ఎయిర్‌టెల్‌ చెప్పింది. దీని ధర రూ.1,399గా పేర్కొంది. నెలవారీ రూ.169 రీఛార్జ్‌ ప్యాక్‌తో డేటా ఆఫర్లు, పలు ప్రయోజనాలను ఈ ఫోన్‌పై ఆఫర్‌ చేస్తోంది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే స్టాక్స్‌ అందుబాటులో ఉన్నాయని, దగ్గర్లోని కార్బన్‌ రిటైల్‌ స్టోర్‌లో వీటిని పొందవచ్చని కూడా ఎయిర్‌టెల్‌ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

ఈ ఫోన్ కావాలనుకునేవారు ముందుగా రూ. 2899 డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఫోన్ తో పాటు 36 నెలల పాటు ప్రతి నెలా 169 రూపాయల రీచార్జ్ అవుతుంటుంది. 18 నెలల తర్వాత రూ. 500 రీఫండ్ చేస్తారు. 36 నెలల తర్వాత మరో రూ. 1000 రీఫండ్ చేస్తారు. అంటే, రూ. 1500 క్యాష్ బెనెఫిట్ ఉంటుందన్నమాట.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.